రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ పై సూప‌ర్‌ అప్డేట్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మనందరికీ సుపరిచితమే. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ” గేమ్ చేంజర్ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని చాలా భారీగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో నటించనున్నాడట రామ్ చరణ్.

ఈ మూవీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సర్వే గంగా జరుగుతుంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ కాల్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఉత్తరాంధ్ర పల్లెటూరి యాసలో మాట్లాడగలిగే వారు వయసుల వారీగా తమ ప్రొఫైల్స్ ను పంపించాల్సిందిగా కోరారు. ఆడియన్స్ కోసం మెయిన్ ఐడి మరియు వాట్సప్ నెంబర్ ను షేర్ చేశారు. ఇక ఈ సెన్సేషన్ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై చరణ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.