అమర్ ఫ్యాన్స్ పై బిగ్‌బాస్ కీర్తి ఫైర్‌.. రోడ్డుపై కనిపిస్తే చంప మీద లాగి పెట్టి కొడ‌తా అంటూ..!!

బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ వైపు అడుగులు వేస్తూ రసవతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. వీళ్ళ‌లో టైటిల్ ఎవ‌రుకొడ‌తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఫేవ‌రెట్ కంటిస్టెంట్ల‌కు స‌పోర్ట్ చేస్తు వారికి ఓట్లు వేయమని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇక తాజాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సీరియల్ యాక్టర్ కీర్తి భ‌ట్ మాట్లాడుతూ తన సపోర్ట్ ఎవరికో బయట పెట్టడంతో అమర్ ఫ్యాన్స్ ఆమెకు అనవసరమైన మెసేజ్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.

అంతేకాకుండా తనకు వస్తున్న మెసేజ్ లపై ఆమె ఘాటుగా స్పందించింది. బిగ్‌బాస్ సీజన్7లో గతవారం గౌతమ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమ్ ఇంట్లో చిన్న పార్టీ జరగగా ఆ పార్టీకి కీర్తి కూడా హాజరైంది. ఆ టైంలో అక్కడికి వచ్చిన యూట్యూబ్ ఛానల్ కీర్తిని గేమ్ గురించి అడగగా అమర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాడని అయినా బాగానే గేమ్ ఆడుతున్నాడని.. అయితే ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్‌గా ఆడుతున్నాడు కాబట్టి.. నా సపోర్ట్ అర్జున్‌కి అని చెప్పుకొచ్చింది. ఇక తను ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అమర్ ఫ్యాన్స్ కీర్తి పై కామెంట్స్ మొదలుపెట్టారు. దీంతో ఆ కామెంట్లపై కీర్తి ఘాటుగా స్పందించింది. ప్రియాంక, శోభ, అమర్‌, అర్జున్‌ నలుగురు నాకు చాలా మంచి ఫ్రెండ్స్.

అందరికీ నేను సపోర్ట్ గా ఉంటాను. అమర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని మాత్రమే నేను అన్న.. కానీ అతను గేమ్ బాగా ఆడుతున్నాడు అని కూడా చెప్పాను. అమ‌ర్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల కింద కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కొంచెం బుర్ర వాడండి.. సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అస్సలు సహించను. నేను కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చా. అక్కడ పరిస్థితులు ఏంటో ఎవరికీ తెలియదు. నేను ప్రేక్షకురాలుగా చూస్తున్నంతవరకు అర్జున్ ఎటువంటి సపోర్ట్ లేకుండా సింగిల్ గా ఆడి ఫినాలే అస్త్రని కష్టపడి గెలుచుకున్నాడు.. కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తా అన్నాను.

ఇక కొందరు ఇన్‌స్టాగ్రామ్ లో పెడుతున్న మెసేజ్ ల పై స్పందించిన కీర్తి.. నువ్వు బిగ్బాస్ లో ఉన్నప్పుడు నీకు సపోర్ట్ చేసి తప్పు చేసామంటు స్టేట్మెంట్ చేస్తున్నారు. ఆ మెసేజ్లు చూస్తుంటే నాకు రక్తం మరుగుతోంది.. రోడ్డు మీద కనిపిస్తే లాగిపెట్టి కొట్టాలని ఉంది. నేను సపోర్ట్ చేయమని అడిగానా.. నా ఆటల న‌చ్చి మీరు సపోర్ట్ చేశారు. సింపతి గేమ్ నేనెప్పుడూ ఆడలేదు. నేను నా వేలు బాగోక పోయినా కష్టపడి ఆడాను. మీరు మీ సెన్స్ కోల్పోయి కామెంట్స్ చేస్తున్నారు. మీ వల్ల మా బాండింగ్ పాడవుతుంది. అందరు కాదు కొందరు మాత్రమే అలా బిహేవ్ చేస్తారు. నీ అమ్మ అంటూ నీచంగా మాట్లాడుతున్నారు.. ఫ్యాన్స్ అయినా కూడా కాస్త ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి అంటూ సలహా ఇచ్చింది కీర్తి.