గూస్ బంప్స్ తెప్పిస్తున్న హృతిక్ ” ఫైటర్ ” మూవీ టీజర్..!!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా.. దీపిక పదుకోన్ హీరోయిన్ గా.. అనిల్ కపూర్ తదితర స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఫైటర్ “. ఇక ఈ సినిమా నుంచి తాజాగా అవైటెడ్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక ఈ టీజర్ అయితే స్టార్టింగ్ లో ఆల్రెడీ పలు హాలీవుడ్ సినిమాలలో చూసిన రెగ్యులర్ సీన్స్ తోనే మొదలైంది కానీ… తరువాత మాత్రం సిద్ధార్థ్ మరోసారి తన క్లాస్ చూపించాడనే చెప్పాలి. గ్రాండ్ యాక్షన్ అండ్ స్లో మోషన్ విజువల్స్ తో గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక వీటితో పాటుగా ఫైనల్ షాట్ లో హృతిక్ జాతీయ పథకాన్ని పట్టుకుని రావడం అన్నిటికన్నా బిగ్గెస్ట్ సన్నివేశంగా మారింది.

ఇక ఈ టీజర్ తో ఈ సినిమాపై భారీ స్థాయిలో హైప్స్ నెలకున్నాయి. ఇక ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు…” ఇలాంటి టీజర్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. నువ్వు సూపర్ అన్న. ఈ టీజర్ ని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగుంది టీజర్. ఇక టీజరే ఇలా ఉంటే.. సినిమా ఇంకే లెవెల్ లో ఉంటుందో “…. అంటూ కామెంట్లు చేస్తున్నారు.