ఇంతమంది స్టార్ హీరోయిన్స్ మన టాలీవుడ్ హీరోలతో ఎఫైర్లు నడిపారా.. ఆ లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్లు అయినా కలిసి ఒకటి రెండు సినిమాలు కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తే వారిద్దరి మధ్య ఎఫైర్‌లు నడుస్తున్నాయి అంటూ వార్తలు రావడం సాధారణమైపోయింది. ఇటీవల కాలంలో హీరోయిన్లు చాలా సులువుగా హీరోల ప్రేమలో పడి నిజంగా సక్సెస్ అవుతున్నారు. వివాహ జీవితంలో అడుగుపెట్టి ఆనందంగా గడుపుతున్నారు. కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్స్ చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరితో ఒకరు నడిపిన స్టార్ హీరో, హీరోయిన్ల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

రష్మిక మందన – విజ‌య్ దేవ‌ర‌కొండ‌


సౌత్ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్ లోను అడుగుపెట్టి అక్కడ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఈమె ప్రేమాయణం నడుపుతుందంటూ న్యూస్ ఎప్పటినుంచో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి వెకేషన్లను కూడా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు. ఇటీవల ఈ జంట ఓకే ట్రౌషర్ తో కనిపించి వీరిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ వార్తలకు మరింత హైప్ పెంచారు.

అంజలి – జై


తెలుగు స్టార్ హీరోయిన్ అంజలి.. తమిళ్ హీరో జైతో ప్రేమలో ఉన్నారంటూ న్యూస్ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి జర్నీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. తాజాగా వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వినిపించాయి.

సిద్ధార్థ్ – అదితి రావు హైదారి


టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన అదితి ఇటీవల సిద్ధార్థ్ తో కలిసి తిరుగుతుంది. పలు పార్టీలలో, ఈవెంట్లలో ఈ జంట సందడి చేస్తున్నారు. ఈ జంట మ‌ధ్య‌ ప్రేమాయణం నడుస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

నాగార్జున – టబు


సీనియర్ హీరోయిన్ టబు తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు నటించి మంచి పాపులారిటి సంపాదించుకుంది. ఇటీవల ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. గతంలో నాగార్జునతో రిలేషన్షిప్ లో ఉందంటూ.. వారిద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ వాళ్ళనే ఈ అమ్మడు ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదంటూ ప‌లు పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు పై ఈ జంట ఎప్పుడు స్పందించలేదు.

రెజీనా కసాండ్రా


టాలీవుడ్ లో ఒకప్పుడు వరస సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. బాలీవుడ్‌లో పలు సినిమాలో నటిస్తూ క్రేజ్‌ సంపాదించుకుంటున్న ఈ బ్యూటీ.. గతంలో ఓ మెగా హీరోతో ప్రేమలో పడిందంటూ ఈమె వ్యవహారం న‌చ్చ‌క మెగా కుటుంబ సభ్యులు ఈమెను బెదిరించరంటూ దీంతో ఆమె ఇండస్ట్రీకి దూరం అయ్యిందంటూ వార్తలు వినిపించాయి.

ప్రభాస్ – అనుష్క శెట్టి


టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి.. దాదాపు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి మెప్పించింది. ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక స్వీటీ – పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారంటూ వీరిద్దరి మధ్య వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.