ఉదయ్ కిరణ్ కెరీర్‌లో రిలీజ్ కాకుండా ఇన్ని సినిమాలు ఆగిపోయాయా..!!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్న ఉదయ్ కిరణ్ కొన్ని కారణాలతో ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అమ్మాయిల ల‌వ‌ర్ బాయ్‌గా, నిర్మాతలకు గోల్డెన్ లెగ్ గా, నిజానికి నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అనే ట్యాగ్‌కు పర్ఫెక్ట్ ఆప్ట్ గా పాపులర్ అయ్యాడు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ కేవలం 20 ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్‌గా మారిపోయాడు.

కానీ అంతే త్వరగా డౌన్ ఫాల్ అయిపోయాడు. దీంతో ఉదయ్‌ కిరణ్ చేతిలో నుంచి చాలా సినిమాలు చేజారిపోయాయి.అప్పట్లో సంచల సినిమాలను నిర్మించిన అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం ఖుషి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాల తర్వాత సూర్య మూవీస్ బ్యానర్ పై ఉదయ్ కిరణ్ హీరోగా ప్రేమంటే సులువు కాదురా అనే మూవీని స్టార్ట్ చేశాడు. 80 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏవో కారణాలతో ఆగిపోయింది. అలాగే ఉదయ్‌కిరణ్ – అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ పతాకంపై ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. పూజ కార్యక్రమలు జరిగి షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా మొదట్లోనే రద్దైపోయింది.

ఇక చిరంజీవి కూతురు సుష్మిత ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ తర్వాత అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఆశిన్‌ జంటగా మరో సినిమాను ప్లాన్ చేశారు. ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా కూడా ఆగిపోయింది. నందమూరి నట‌సింహ స్వీయ దర్శకత్వంలో భారీ క్యాస్టింగ్‌తో నర్తనశాల సినిమా మొదలయింది. అభిమన్యుడు పాత్రలో ఉదయ్ కిరణ్ సినిమాలో నటించాడు. అయితే ప్రధాన పాత్రధారి అయిన సౌందర్య.. హఠాత్ మరణంతో ఈ సినిమా ఆగిపోయింది.

హిందీలో సూపర్ స్టార్ అయిన జబ్ వీ మీట్ సినిమాను ఉదయ్ కిరణ్, త్రిష కాంబినేషన్లో తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమా కూడా ఎవో కారణాలతో ఆపేశారు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ కూడా ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చారు. అయితే ఈ సినిమా కూడా రిలీజ్ కాకముందే ఆగిపోయింది. ఉదయ్ కిరణ్ మార్కెట్ సడన్గా పడిపోవడంతో నిర్మాతలు నష్టపోవడం ఇష్టం లేక ఈ సినిమాను ఆపేసారని టాక్.

 

ఉదయ్ కిరణ్ అంటే అప్పటికే మనసంతా నువ్వే, నీ స్నేహాం లాంటి సినిమాలు నిర్మించి లాభాల బాట పట్టిన ఎం. ఎస్. రాజు ఆ తర్వాత కూడా ఒక సినిమా చేయాలనుకున్నా.. చివరి నిమిషంలో ఆ సినిమాను క్యాన్సిల్ చేశాడట. తెలుగులో వైవిధ్య కథలను ఎంచుకుంటూ దర్శకత్వం వహించే చంద్రశేఖర్ ఏలేటి కూడా.. ఉదయ్ కిరణ్‌తో సినిమాలు ప్లాన్ చేసి ఆపేసాడు. ఉదయ్ కిరణ్ సినీమాకు ప‌రిచ‌యం చేసిన డైరెక్టర్ తేజ ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఉదయ్ కిరణ్ డైలమాలో ఉన్న టైంలో అవునన్నా.. కాదన్నా.. సినిమాని చేశాడు. మరోసారి సినిమా చేయాలనుకున్న కూడా.. ఇక అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ సినిమాలు అన్నీ ఎందుకు ఆగిపోయాయో అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న.