ఆ డైరెక్టర్ దర్శకత్వంలోనే సితారా ఎంట్రీ ప్లాన్ చేస్తున్న మహేశ్.. ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకముందు నుంచే తన తండ్రి తన తాత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకుంది. అయితే సితార ను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం ఖాయం . ఆమెను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కచ్చితంగా తీసుకొస్తామంటూ మహేష్ కూడా చెప్పుకొచ్చారు .

మహేష్ ఒకవేళ సితార ను ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ఏ డైరెక్టర్ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేస్తాడు అన్న క్వశచన్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా చాలామంది రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో సీతారను ఇంట్రడ్యూస్ చేయాలి అని కోరుకుంటున్నారు. మరికొందరు ఆయన డైరెక్షన్ ఓల్డ్ అయిపోయింది . ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సితార ఎంట్రీ ఇస్తేనే కరెక్ట్ .

వీళ్ళిద్దరూ మాత్రమే హీరోయిన్స్ అందాలని ఇంకా ఎక్కువగా చేసి చూపించి కంటెంట్ లో వాళ్లను ఇన్వాల్వ్ చేస్తారు అంటూ చెప్పుకొస్తున్నారు .దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సితార ఘట్టమనేని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే న్యూస్ వైరల్ అవుతుంది. చూడాలి మరి మహేశ్ ఏ డైరెక్టర్ కు ఇంట్రెస్ట్ చూపిస్తాడో..?