ఆ తెలుగమ్మాయికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య.. ఇక ఈ బ్యూటీ దశ మారినట్లేగా..!!

బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎక్కడైనా.. ఏదైనా పార్టీ, ఫంక్షన్స్ లాంటివి జరిగితే అక్కడ ముందుగా వినిపించే పేరు ” జై బాలయ్య “. ఇక బాలయ్య ఇటీవలే ” భగవంత్ కేసరి ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం అదే జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు బాలయ్య. ఇక ఇందులో యువ దర్శకుడు బాబీ తో చేస్తున్న 109 వా సినిమా కూడా ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా సాగుతుంది. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో ” కలర్ ఫోటో ” ఫేమ్ హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ విరామం సమయంలో డైరెక్టర్ తో కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.