హీరో సిద్ధార్థ అసిస్టెంట్ డైరెక్టర్గా.. మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కిందని తెలుసా ..?!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా స్టార్ హీరోగా మారాలంటే ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారిన వారిలో సిద్ధార్థ్‌ ఒకరు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి. సినిమాలో హీరో అయ్యేందుకు వచ్చిన సిద్ధార్థ సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఎంతోమంది డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పలు సినిమాలకు పని చేశాడు.

Watch Boys | Prime Video

 

ముఖ్యంగా కే. బాలచందర్, మణిరత్నం, శంకర్, రాఘవేందర్రావు లాంటి అప్పట్లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. కొంతమంది డైరెక్టర్ సిద్ధార్ద్‌ని గౌరవిస్తే.. మరి కొంతమంది డైరెక్టర్స్ ఆయన్ని చాలా అవమానించారని టాక్. అవమానాలన్నీ తట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శంకర్ సినిమాలోనే హీరోగా.. నటిస్తూ బాయ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. స్టార్ హీరోగా ఎలాంటి పాపులారిటీ దక్కించుకున్నాడో అంద‌రికి తెలుసు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సిద్ధార్థ తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

Naani - Wikipedia

ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాకు సిద్ధార్థ అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆ సినిమా ఏంటో అనుకుంటున్నారా.. నాని. మహేష్ బాబు – ఎస్ జె సూర్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కదా అర్థం కాకపోవడంతో ప్రేక్షకుల సినిమాకు కనెక్ట్ కాలేదు. అయితే మహేష్ సినీ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక సినిమాగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.

Siddharth gets nostalgic as he remembers the music of Nuvvostanante  Nenoddantana | Telugu Movie News - Times of India

అయితే అప్పట్లో ఎస్‌జే సూర్యకు అసిస్టెంట్ డైరెక్టర్గా సిద్ధార్థ పని చేశారట. సిద్ధార్థ బాయ్స్ సినిమాతో అప్పటికే హీరోగా పరిచయమైనా.. సూర్య స్పెషల్ రిక్వెస్ట్ కారణంగా సిద్ధార్థ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండడానికి యాక్సెప్ట్ చేశాడట. అలా సిద్ధార్థ్‌ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చివరి సినిమా కూడా మహేష్ బాబు నాని మూవీనే కావడం విశేషం. ఇక దీని తర్వాత సిద్ధార్థ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో సక్సెస్ను అందుకొని టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులర్ అయ్యాడు.