తన 50వ మూవీ పై దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చి పడేసిన ధనుష్… నిజంగా నువ్వు కేక బాసు…!!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా ” సార్ ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకున్నాడు.

ఇక ఈ మూవీ అనంతరం తన కెరీర్ లోనే భారీ చిత్రం ” కెప్టెన్ మిల్లర్ ” అనే సినిమాతో రిలీజ్ కి సిద్ధంగా ఉండగా.. ఈ క్రమంలోనే వరుస అప్డేట్స్ అందిస్తున్నాడు ధనుష్. ఇక ఈ మూవీ అనంతరం తన కెరీర్ బెంచ్ మార్క్ 50వ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకి తానే దర్శకత్వం వహించుకోవడంతో.. ఈ మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ సప్రైజ్ అప్డేట్ ఇచ్చాడు ధనుష్. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లుగా తెలిపాడు ధనుష్. అలాగే తన మూవీ యూనిట్ కి గాను థాంక్స్ చెప్తున్నట్లు తెలిపారు. ఇక వారితో పాటుగా నిర్మాతలు సన్ పిక్చర్స్ కళానిధి మారన్ లు నా విజన్ ని నమ్మినందుకు థాంక్స్ అంటూ రాసుకు వచ్చాడు ధనుష్. ప్రస్తుతం ధనుష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.