పెరుగు – మజ్జిగ.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. వీటిలో ఇంత డిఫరెన్స్ ఉందా..!

సాధారణంగా ప్రతి ఒక్కరిలో సందేహం ఉంటుంది. అదేంటంటే.. మన ఆరోగ్యానికి పెరుగు మంచిదా లేదా మజ్జిగ మంచిదా అని సందేహం ఉంటుంది. చాలామంది పెరుగును ఇష్టపడుతూ ఉంటారు. మరికొందరు మాత్రం మజ్జిగను ఇష్టపడుతూ ఉంటారు.

How to Make Yogurt at Home - My Tasty Curry

ఈ రెండిట్లో కూడా క్యాల్షియం, పొడేషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రెండిటిని సరి పడ తీసుకోవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం మజ్జిగ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మజ్జిగ తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి వస్తుంది. అనంతరం మీకు ఆకలి వేయదు. తద్వారా మీరు బరువు తగ్గుతారు.

Indian Buttermilk - Masala Chaas - Culinary Shades

అలాగే మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగు పడుతుంది. ఇక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మజ్జిగ తాగడం వల్ల శక్తి, జీర్ణ క్రియ కు ఉపయోగపడుతుంది. అందువల్ల పెరుగు కంటే మజ్జిగ మంచిది. కాబట్టి ప్రతిరోజు మజ్జిగ తీసుకోకపోయినా వారానికి కనీసం మూడుసార్లు అయినా మజ్జిగని తీసుకోవడం అలవాటు చేసుకోండి.