అనుష్క శర్మ పెళ్లి చేసుకుంది విరాట్ కోహ్లీ ని కాదా… రాహుల్ నా… బయటపడ్డ అసలు గుట్టు….!!

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు వీరిద్దరూ ఒక షాంపూ యాడ్లో కలిసి నటించే సమయంలోనే ప్రేమలో పడ్డారు. అయితే వీరిద్దరూ పెళ్లి మాత్రం చాలా సీక్రెట్ గా చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది. అలాగే అనుష్క ప్రస్తుతం సినిమాలలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క శర్మ పెళ్లి చేసుకుంది విరాట్ కోహ్లీని కాదు రాహుల్ ని అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మనే చెప్పడం గమనార్హం. ” మా పెళ్లి కేవలం 42 మంది అతిథుల సమక్షంలోనే జరిగింది. అయితే మా పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే పెళ్లిని సీక్రెట్ గా చేసుకున్నాం.

ఇక విరాట్ కోహ్లీ సెలబ్రెటీ కావడంతో ఆయన పేరు ఎక్కడ బయట పడుతుందో అనే ఉద్దేశంతో విరాట్ పేరును మార్చేసి రాహుల్ గా పెట్టి మ్యానేజ్ చేసాం. విరాట్ పేరు బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాం. ఒక సెలబ్రిటీ పెళ్లి లాగా కాకుండా ఒక మామూలు సామాన్యుడు పెళ్లి ఎలా ఉంటుందో అలాగే మేం పెళ్లి చేసుకోవాలని భావించి.. హంగు ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నాం ” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వార్త చూసినవారు అనుష్క పెళ్లి చేసుకుంది విరాట్ ని కాదా?… రాహుల్ నా?.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.