‘ గుంటూరు కారం ‘ ఆ బ్లాక్ బస్టర్ సాంగ్ లిరిక్స్ అలా రావ‌టానికి యాక్ట్రెస్ పూర్ణ కార‌ణ‌మా..?!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోను.. అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ నెల‌కొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు.

Glamorous Actress Poorna Dazzles In Designer Outfit

ఆల్రెడీ సినిమా నుంచి దమ్ మసాలా, ఓ మై బేబీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా కుర్చీ మడత పెట్టి అనే మాస్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజమండ్రి రాగ మంజరి మా అమ్మ పేరు తెలియనోళ్లు లేరు మేస్త్రి అంటూ ఈ సాంగ్ మొదలవుతుంది. లిరికల్ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలని చూపించారు. ఆ విజువల్స్.. లిరిక్స్‌ చూసి హీరోయిన్ పై దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలో అలాంటి లిరిక్స్ ఏంటి అంటూ నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

Guntur Kaaram's Kurchi Madatha Petti Song Promo Out, Mahesh Babu Grooves to Peppy Beats With Sreeleela

అయితే దీని వెనుక మేకర్స్ ఉద్దేశం వేరని తెలుస్తుంది. ఈ పాట ముందు ఐటెం సాంగ్ గా ప్రారంభమవుతుందని.. పైన చెప్పుకున్న లిరిక్స్ మొదట ఆ పాటలో ఐటెం గర్ల్ గా కనిపించనున్న పూర్ణపై ఉంటాయని తెలుస్తుంది. తరువాత శ్రీ లీలా, మహేష్ బాబు డ్యాన్స్ తో ఈ పాట కంటిన్యూ అవుతుందట. ఈ విషయాన్ని తెలియని చాలామంది శ్రీ లీల గురించి అలాంటి పాట రాశారని ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ కూడా రిలీజ్ చేయలేదు.