నాగ్ ” నా సామి రంగ ” మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే..!

అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ లో అడుగు పెట్టినటువంటి నాగార్జున.. మంచి పాపులారిటీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలన్నీ చేసిన ఈయన ప్రస్తుతం ” నా సామి రంగ ” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

విజయ్ బిన్నీ తెరికెక్కిస్తున్న ఈ మూవీపై నాగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే.. గత కొన్ని రోజులు నుంచి సస్పెన్స్ గా ఉన్నటువంటి ఈ మూవీ రిలీజ్ డేట్ నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

జనవరి 14న గ్రాండ్గా రిలీజ్ చేస్తామంటూ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక అంతే కాకుండా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను కూడా ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేయడంతో ఈ సినిమాని చూసేందుకు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.