ఇండస్ట్రీలో అడుగు పెట్టాక పేరు మార్చుకున్న హీరోయిన్ల లిస్ట్ ఇదే..

చిన్న సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక తమ పేర్లను మార్చుకున్నారు. కొంతమంది ఆ పేరు కలిసి రావడం లేదని అదృష్టం కోసం పేరు మార్చుకుంటే.. మరి కొంతమంది పేరు క్యాచీగా లేదని ఉద్దేశంతో మార్చుకున్నారు. మరికొందరికి అయితే దర్శకులే పేర్లు మార్చి డిస్ప్లే చేస్తూ ఉంటారు. అలా మన సౌత్ ఇండియాలో హీరోయిన్లు చాలామంది ఇండస్ట్రీ లోకి వచ్చాక పేర్లు మార్చుకున్నారు. అలా పేర్లు మార్చుకున్న స్టార్ బ్యూటీ లెవరు ఇప్పుడు చూద్దాం.

జయసుధ :


ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ. ఇప్పటికీ పలు సినిమాల్లో వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ నటిస్తుంది. వరుస అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే జయసుధ అసలు పేరు సుజాత. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు ఆమె పేరు మార్చారు.

జయప్రద :


గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగిన జయప్రద కూడా తన అసలు పేరును మార్చుకుందట. జయప్రద అసలు పేరు లలితా రాణి కానీ సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరు మార్చుకుంది.

సౌందర్య :


మహానటి సావిత్రి తర్వాత సినిమాల్లో అదే రేంజ్ లో నటనతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సౌందర్య. ఎక్స్పోజింగ్ దూరంగా ఉంటూ తన కట్టుబొట్టుతో కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కర్ణాటక అమ్మాయి అయినా సౌందర్య అసలు పేరు సౌమ్య. కాగా సినిమాల్లోకి వచ్చాక సౌందర్య గా మారింది.

రోజా :


సినిమాల్లోనే కాక రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ల కొనసాగుతున్న రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి అట. అయితే సినిమాల్లోకి వచ్చాక అంత పేరు క్యాచిగా లేదనే ఉద్దేశంతో సీనియర్ యాక్టర్ శివప్రసాద్ ఆమె పేరును రోజాగా మార్చాడట.

రంభ :


ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రంభ.. అసలు పేరు విజయలక్ష్మి అట. అయితే సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరు మార్చుకుంది.

అనుష్క శెట్టి :


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో అనుష్క శెట్టి ఒకటి. అయితే ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఆమె పేరు అనుష్క శెట్టిగా మార్చారట. అయితే స్వీటీ అనే పేరు నిక్ నేమ్ కాదు ఆమె అసలు పేరు స్వీటీ అట‌.