అర్జున్ కూతుర్ని చేసుకోవడానికి ఐశ్వర్య కు కాబోయే మామ పెట్టిన కండిషన్ ఏమిటంటే..?

తెలుగు కన్నడ తమిళ్ వంటి బాసరలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ సార్జ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల తన కూతురు ఐశ్వర్య ప్రేమించిన అబ్బాయితో నిశ్చితార్థం కూడా చేయడం జరిగింది.త్వరలోనే పెళ్లికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.. ఐశ్వర్య నటించిన రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ప్రస్తుతానికి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది ఈ ముద్దుగుమ్మ.

Arjun Sarja's daughter Aishwarya to marry Thambi Ramaiah's son soon;  Details Inside | PINKVILLA

ఈ సమయంలోనే ఐశ్వర్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ప్రేమలో పడింది వీరిద్దరూ ప్రేమ పెళ్లిదాకా తీసుకువెళ్లడం జరిగింది ఐశ్వర్య ఉమాపతి ప్రేమకు సైతం ఇద్దరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కేవలం ఇరువురు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఐశ్వర్య- ఉమాపతి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోతోంది..

How Aishwarya Arjun and Umapathy Ramaiah fell in love without acting  together? - Tamil News - IndiaGlitz.com

అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక వార్త ప్రకారం నటుడు తంబి రామయ్య తనకు కాబోయే కోడలికి ఒక కండిషన్ పెట్టారని తెలుస్తోంది.. అదేమిటంటే వివాహం తర్వాత తన కోడలు ఐశ్వర్య సినిమాలలో నటించకూడదనే కండిషన్ ని పెట్టినట్లు తెలుస్తోంది.తను కాబోయే మామగారు కండిషన్ కి సైతం ఒప్పుకొని ఐశ్వర్య ఈ పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరు వెళ్తారో చూడాలి మరి. అర్జున్ కూడా ఇటీవలే లియో సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించారు.