రణ్‌బీర్ ‘ యానిమల్‌ ‘ కు ఆ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. సందీప్‌రెడ్డి వంగా కామెంట్స్ వైర‌ల్‌..

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు సందీప్‌ రెడ్డి.వంగా. టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఇదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసాడు. కబీర్ సింగ్ పేరుతో ఈ సినిమాను అక్కడ రీమేక్ చేయగా.. అక్కడ కూడా అదే రేంజ్‌లో సక్సెస్ అందుకని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా కూడా మార్క్‌ క్రియేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సందీప్ రెడ్డి మరో సినిమాను తెరకెక్కించాడు. యానిమల్ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించారు.

డిసెంబర్ 1న పాన్‌ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో నిర్వహిస్తున్నారు. మూవీ టీం ఇలా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి అసలు ఈ సినిమాకు యానిమల్ అనే టైటిల్ ఎందుకు పెట్టాడో ఆ టైటిల్ వెనుక ఉన్న కారణం ఏంటో వివరించాడు. ఆ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ మూవీలో హీరో పాత్ర చాలా వైల్డ్‌గా ఉంటుంది. ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి అలాంటి పేరైతేనే సరిపోతుంది అంటూ వివరించాడు.

మనుషులకు ఐక్యూ ఉంటుంది కాబట్టే కమ్యూనికేషన్ పెరిగి ఫుడ్ చేన్లో మొదటిగా బట్టలు ధరించాలని, తర్వాత ఇల్లు కట్టుకోవాలని ఇలా డెవలప్మెంట్ అన్ని చేసుకుంటూ వచ్చాము. ఐక్యు అనేదే లేకపోతే మనం కూడా యానిమల్స్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు. యానిమల్స్‌కు ఐక్యూ ఉండదు కదా వాటి లక్షణాలతో అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో హీరో కూడా తన ప్రకృతితో వ్యవహరిస్తూ ఉంటాడు. కనుక ఈ సినిమాకు యానిమల్ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించి ఆ టైటిల్‌లో ఎంపిక చేసుకున్నా అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.