సందీప్ నన్ను నామినేట్ చేయమని అడిగాడు.. టేస్టీ తేజ స‌మాధానం ఇదే..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్.. నిన్నటి ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక గత వారం ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్, టేస్టీ తేజ ఇద్దరు హౌస్ లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎలిమినేట్ అయ్యాకే అసలు గొడవలు మొదలయ్యాయి. 8 వారాలు నామినేషన్ లో లేకుండా వచ్చిన సందీప్ కేవలం తేజ కారణంగా నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యాడు. ఇక‌ సందీప్ మనసు గట్టిగా హర్ట్ అయింది. అంతేకాదు తేజ ఎలిమినేట్ అవుతాడు.. అనగానే ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ అందరినీ ఎలిమినేట్ చేసి తను చివరికి ఎలిమినేట్ అయ్యాడు అంటూ ట్యాగ్ కూడా ఇచ్చుకున్నాడు.

అయితే తేజ హౌస్ లో ఉండగా సందీప్ మాస్టర్ కావాలనే తనని నామినేట్ చేయించుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో బయట ఉన్న సందీప్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ అది అబద్ధం. నేనెందుకు అడిగిమరీ నామినేషన్ చేయించుకుంటాను.. ఈ ఒక్క విషయం చాలు వాడిని హౌస్ నుంచి బయటికి తీసుకురావడానికి అంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా ఇదే ప్రశ్నను హోస్ట్ టేస్టీ తేజను అడగగా ఆ ఒక్క ప్రశ్న నన్ను అడగకండి మీరు హౌస్ లో లేరు.. హౌస్ లో ఏం జరిగింది ఏంటి అనేది మీకు తెలియదు. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడను.

సందీప్ నేను కలిసి ఈ విషయంపై వీడియో చేస్తాము అంటూ ప్రశ్నలు దాటేశాడు. ఆ తర్వాత అడిగిన ప్రశ్నలన్నింటికీ ఠ‌క్కున సమాధానం చెప్పాడు. ఇక హౌస్ లో ఓ టాస్క్ లో భాగంగా గౌతమ్‌ని నేను గట్టిగా కొట్టానని.. అందుకు అతడి ఇంటికి వెళ్లి మరి గౌతమ్ పేరెంట్స్ కు సారీ చెప్తానంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫుటేజ్ వైరల్ అవ్వడంతో తేజ కేవలం సందీప్ నామినేషన్ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పలేదంటే.. తేజ హౌస్ లో అబద్ధం చెప్పాడు అందుకే దీనికి సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటూ నెట్టిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.