శర్వానంద్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే తండ్రి కాబోతున్న యంగ్ హీరో..

టాలీవుడ్ లో తన‌కంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటు నటిస్తున్న శర్వానంద్.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక శర్వానంద్ తాజాగా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. రక్షిత రెడ్డి అనే సాఫ్ట్వేర్ అమ్మాయిని శర్వానంద్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఈ ఏడాది జూన్‌లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ నాయకులు కూడా ఈ పెళ్లిలో హాజరయ్యారు.

ఇక రక్షిత రెడ్డి హైదరాబాద్ అడ్వకేట్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు కావడంతో వారికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక తాజాగా శర్వానంద్ ఫ్యామిలీ మరోసారి సంబరాల్లో మునిగి తేలుతున్నారంటూ న్యూస్ వైరల్ అవుతుంది. రక్షిత రెడ్డి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రక్షిత రెడ్డి – శర్వానంద్ కలిసి అమెరికాలో ఉంటూ షూటింగ్ టైంలో ఇండియాకి వచ్చి వెళ్తున్నారు.

రక్షిత అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కారణంగా వారు అమెరికాలోనే ఉంటున్నారు. సినిమా షూటింగ్స్ సమయంలో మాత్రమే శర్వానంద్ ఇండియాకి వస్తున్నాడు. ఇక పెళ్లయిన ఐదు నెలల్లోనే ఈ జంట ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట. వీరిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక రక్షిత రెడ్డి డెలివరీ కూడా యూఎస్ లోనే ఉండబోతుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ – శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.