వాళ్ళు ప‌నిచేసినా మొద‌టి మూవీనే ఇంటిపేరుగా మార్చుకున్న సెల‌బ్రెటీలు ఎవ‌రంటే..?

టాలీవుడ్‌లో చాలా మంది సెల‌బ్రెటీల‌కు వాళ్ళు వ‌ర్క్ చేసిన‌ సినిమా పేర్లే ఇంటి పేర్లుగా మారిపోయాయి. దానికి కార‌ణం వాళ్ళు చేసినా ఫ‌స్ట్ మూవీతోనే విజ‌యం సాధించ‌డం. ఆ మూవీతోనే వారు ఓ రేంజ్‌లో స‌క్స‌స్ అందుకోవ‌టం. అలా మొద‌టి సినిమానే ఇంటి పేరుగా మారిన వారిలో ఒక‌ప్ప‌టి యాక్ట‌ర్ల నుంచి ఈ జ‌న‌రేష‌న్ సెల‌బ్రెటీస్ వ‌ర‌కూ ఉన్నారు. అలా పేరు తెచ్చుకున్న‌వారు ఎవ‌రో ఓ లుకేద్దాం రండి. ఇటీవ‌ల మ‌ర‌ణించిన సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఆయ‌న‌ ఇంటి పేరు సిరివెన్నెల కాన‌ప్ప‌టికి మొద‌టిసారి వ‌ర్క్ చేసిన‌ సిరివెన్నెల ఆయ‌న‌కు ఇంటిపేరుగా మారింది.

 

కే విశ్వ‌నాథ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ మూవీ సాంగ్‌తో మంటి గుర్తింపు రావ‌డంతో సీతారామాశాస్త్రి సిరివెన్నెల‌గా మారిపోయారు. అల్ల‌రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో న‌రేష్ కూడా ఫ‌స్ట్ మూవీ మంచి విజ‌యం సాధించ‌డంతో అల్ల‌రి న‌రేష్ గా పేరు తెచ్చుకున్నాడు. నైజాంలో డిస్ట్రిబ్యూట‌ర్ గా ఎంతో పేరుతెచ్చుకున్న రాజు.. త‌న ప్రొడ్యూస్ చేసిన మొద‌టి సినిమా దిల్ స‌క్స‌స్‌తో దిల్ రాజుగా మారాడు.

వెన్నెల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యాక్ట‌ర్‌ కిషోర్ ఈ మూవీలో క‌మెడియ‌న్ గా న‌టించి అల‌రించాడు. త‌న కామెడి టైమింగ్‌తో మంచి మార్కులు కొట్టేసి కిషోర్ వెన్నెల కిషోర్ గా మారాడు. స‌త్యం సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన రాజేష్ ఆ త‌ర‌వాత స‌త్యం రాజేష్ గా మారిపోయాడు. సీనియ‌ర్ న‌టి జాన‌కి షావుకారు సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర‌వాత ఆమె పేరు షావుకారు జాన‌కిగా అంద‌రు పిల‌వ‌టం మొద‌లుపెట్టారు అలా జాన‌కి షావుకారు జాన‌కిగా మారింది.