సపోటా వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!!

తినడానికి రుచికరమైన పండ్ల లలో సపోటా పండు కూడా ఒకటి.. ఈ సపోటా పండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం చాలా వేగవంతంగా అవుతుంది.. అంతేకాకుండా దీని సహజ చక్కెర కూడా శరీరానికి చాలా శక్తి ఇస్తుందట. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వీటిని తినడం వల్ల చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సహజంగా కూడా సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది.

సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి జుట్టు మరియు చర్మానికి సంబంధించిన వాటికి మేలు చేస్తాయి.. తలనొప్పి, జుట్టు రాలడం ,చర్మా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతిరోజు ఒక సపోటా పండును తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వీటన్నిటిని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఫేస్ లోని ముడతలను కూడా నివారించడానికి ఈ సపోటా పండు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలలో పొటాషియం రక్తపోటు సమస్యను సైతం తగ్గిస్తుంది.

సపోటాలో ఉండే విటమిన్ సి ఈ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సైతం చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఐరన్ ఫాస్ఫరస్ ఉండడం వల్ల సపోటా పండు ఎముకలకు చాలా దృఢత్వాన్ని కలిగించే ఖనిజాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల మరిన్ని పోషకాలు లభిస్తాయి. అయితే పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ఇతరత్రా వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఏ సీజన్లో అయినా సరే దొరికేటి పండ్లు చాలా విలువైనవి గా భావిస్తూ ఉంటారు. సపోటా వల్ల ఇవే కాకుండా పలు రకాల లాభాలు ఉన్నాయి.