సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు దీటుగా సినిమాల్లో నటిస్తూ అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. అయితే మహేష్ బాబు ఏదైనా కథను ఎంచుకోవాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటాడు అన్న సంగతి అందరికీ తెలుసు. అలా ఆయన తీసుకునే డేసిషన్స్ కూడా దాదాపు సక్సెస్ అవుతాయి. మహేష్ బాబు ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్. పోకిరి, మహర్షి లాంటి సినిమాలు ఆల్ టైం రికార్డులు సృష్టించాయి.
అయితే మహేష్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన తరువాత కూడా విడుదల కాని సినిమాల లిస్టు కూడా పెద్దగానే ఉంది. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హరే రామ హరే కృష్ణ అనే మూవీని ప్రకటించారు. దీనికి యం ఎస్ రాజు ప్రొడ్యూసర్‌గా కూడా ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అలాగే శివమ్ అనే పేరుతో మహేష్ బాబు హీరో గా క్రిష్ దర్శకుడి గా ఓ మూవీ అనౌన్స్ చేశారు. అంతే కాకుండా సోనాక్షి సిన్షా ను హీరోయిన్ గా కూడా సెలెక్ట్ చేశారు.
కానీ ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. అలాగే మణిరత్నం – మహేష్ , విక్రమ్ కాంబోలో కూడా ఒక ప్రాజెక్ట్ ను ప్రకటించారు. కానీ ఈది కూడా సెట్స్ పైకి రాలేదు. దుర్డా ఆర్ట్స్ బ్యానర్ పై హేమాందర్ డైరెక్షన్ లో మిర్చి అనే సినిమా ను అనౌన్స్ చేసినా ఇది వర్కౌట్ అవ్వలేదు. సూరెందర్ రెడ్డి దర్శకత్వం లో మిస్టర్ ఫర్ ఫెక్ట్, వినాయక్ తో కూడా ఒక సినిమా, అలాగే జనగణమన పూరి జగన్నాథ్ దర్శకత్వం లో అనౌన్స్ చేశారు. ఇవేవి సెట్స్ పైకి వెళ్లలేదు. ఇలా చాలా సినిమా లు అనౌన్స్మెంట్ చేసినా రిలీజ్ కాలేదు.