ఫైనల్లీ.. మెగా హీరో సినిమా ఆఫర్ పట్టేసిన సాయి పల్లవి.. కానీ అదే డౌట్..?

ఫైనల్లీ హైబ్రిడ్ పిల్ల మెగా ఆఫర్ పట్టేసింది . వరుణ్ తేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫిదా సినిమా ద్వారా ఎంత మంచి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుంది . ఆమె తీసిన సినిమాలు హిట్టు ఫట్టు అని తేడా లేకుండా అభిమానులు ఆదరించారు .

ఆమెకు పవన్ కళ్యాణ్ కి ఇచ్చే గౌరవం ఇచ్చారు . దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. అయితే గార్గి సినిమా తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు చేయడం ప్రారంభించింది. తమిళ్ లో రెండు సినిమాలు తెలుగులో నాగచైతన్య సినిమాకు సైన్ చేసింది .

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు సైతం యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది. చరణ్ పక్కన సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఈమె మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయిందా ..? రెండో హీరోయిన్గా సెలెక్ట్ అయిందా..? అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతుందట. ఫిజిక్ ఫిట్గా ఉన్న సాయి పల్లవి అయితే ఈ పాత్రకి బాగుంటుంది అంటూ బుచ్చిబాబు సనా ఇలా కాంబో ఫిక్స్ చేశారట..!