ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇప్పటికి విడుదల చేసిన టీజర్ చాలా వైరల్ గా మారింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని ఎప్పుడు విడుదల చేస్తారా అంటే అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేటును డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్ ప్రకటించడం జరిగింది. దీపావళి కానుకగా ట్రైలర్ లాంచ్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.. డిసెంబర్ 1 రాత్రి 7 గంటల19 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడం జరిగింది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.

ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చే విధంగా ఉంటుందని సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా మాఫియా చుట్టూ తిరిగే కథాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది అంతేకాకుండా ఇందులో ఒక ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. బాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు కూడా నటిస్తూ ఉన్నారు. సలార్ రెండవ భాగాన్ని విడుదల తేదీని వచ్చే ఏడాది ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.