వరల్డ్ కప్ పై రజిని జోష్యం.. ఎవరు గెలుస్తారో చెప్పిన తలైవార్..

ప్రస్తుతం ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వన్డే మ్యాచ్ లలో భారత్ జైత్రయాత్ర చేస్తుంది. వరల్డ్ కప్ 2023 లో భాగంగా వన్డే మ్యాచ్‌లు అన్నీ పూర్తయ్యాయి. ఫైనల్ మ్యాచ్ లోకి ఇండియా అడుగుపెట్టింది. వరుసగా ఎనిమిదో సారి ఫైనల్ కు వచ్చింది భారత్. ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు టీం. ఇక ఈ ఆదివారం టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన క్రికెట్ పోరు హోరాహోరీగా జరగనుంది. కచ్చితంగా ఈసారి విజయం ఇండియాదే అంటూ క్రికెట్ అభిమానులు కూడా ధీమాగా చెప్తున్నారు. దానికి కారణం టీమ్ ఇండియా కూడా మంచి ఫామ్‌లో ఉండడం.

Rajinikanth Gives Indirect Slap To YCP

 

అంతేకాదు ఈ ఫైనల్ పోరు చూడడానికి ముఖ్యఅతిథిగా భారత ప్రధాని మోడీ రాబోతున్నాడు. ఇక కప్పు ఎవరు గెలుస్తారో అనే విషయంపై ఇప్ప‌టికే చాలామంది సెలబ్రిటీస్ కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల ముంబై వేదికపై జరిగిన ఇండియన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు సతీసమేతంగా సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. ఇక ఆరోజు జరిగిన మ్యాచ్లో ఇండియా విజయాన్ని సాధించింది.

ODI World Cup 2023: New ICC Rules, Semi-final Equations – All You Need To  Know | India.com

అదేవిధంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ 50 సెంచరీలతో కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కు మీడియా నుంచి ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుచుకుంటారు అనే ప్రశ్న ఎదురుకాగా ఆయన స్పందిస్తూ ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది అంటూ నమ్మకాని వ్య‌క్త ప‌రిచాడు. ప్రస్తుతం రజనీకాంత్ వరల్డ్‌కప్ విన్నింగ్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.