టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ నమిత గురించి చెప్పాల్సిన పనిలేదు.. సొంతం సినిమాతో తన కెరీర్నే ప్రారంభించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి జెమిని సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందానికి ఫిదా అయ్యారు. కానీ ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాలో నటించే సమయానికి చాలా బొద్దుగా మారిపోయింది. దీంతో తెలుగులో పలు సినిమా అవకాశాలు కనుమరుగయ్యాయి.
అయితే నమిత అధిక బరువు పెరగడంతో ఈమె పక్కన హీరోలుగా నటించడానికి ఎవరు ముందుకు రాలేకపోయారు.. దీంతో చిన్న చిన్న పాత్రలలో అవకాశాలను అందుకునేది.ఈ విధంగా నమిత పను సినిమాలలో నటించిన పెద్దగా ప్రాధాన్యత రాకపోవడంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది..కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన ఒక మోస్తారు గానే ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్గా నమిత ఒక వెలుగు వెలిగిన ఏకంగా తనకి ఒక గుడిని కూడా కట్టించే అంత అభిమానం పెరిగిపోయింది.. తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్ గా పేరు సంపాదించింది.
క్రమక్రమంగా ఈమెకు తమిళంలో కూడా అవకాశాలు తగ్గిపోవడంతో పాటు రోజురోజుకి బరువు పెరగడంతో ఈమెను చూడడానికి కూడా పెద్దగా ప్రేక్షకులు మక్కువ చూపలేదట. శరీరం బరువు పెరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ బరువు పెరిగిపోతూనే వస్తోందట నమిత.. నమిత పూర్తిగా డిప్రెషన్ కి లోనై థైరాయిడ్ అంటే సమస్యలతో ఇబ్బంది పడుతోందట. ఈ కారణంగానే ప్రతిరోజు మందులు వాడుతున్న శరీర బరువు పెరిగిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని తిరుపతిలో వివాహం చేసుకుంది. దీంతో ప్రస్తుతం దీన్ని పూర్తిగా వైవాహిక జీవితంలో స్థిరపడిపోయినట్లు తెలుస్తోంది.