పెళ్లిపై అలాంటి వీడియోని షేర్ చేసిన నవదీప్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా పేరు పొందిన వారిలో హీరో నవదీప్ కూడా ఒకరు మొదట జై సినిమాతో తెలుగు పరిచయమైన నవదీప్ పలు సినిమాలలో నటించారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలలో నటించడం జరిగింది అయితే తన కెరియర్లో గౌతమ్ ఎస్ఎస్సి సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆర్య-2, ధ్రువ నేనే రాజు నేనే మంత్రి అలా వైకుంఠపురం తదితర చిత్రాలలో నటించడం జరిగింది. అయితే ఈ ఏడాది న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా పెళ్లిపైన ఆసక్తికరమైన వీడియోని షేర్ చేయడం జరిగింది నవదీప్.

Navdeep (@pnavdeep26) / X

ఈ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ పెళ్లిళ్లపైన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మా మదర్ ఇండియా ఉదయాన్నే నన్ను ఒక ప్రశ్న వేయడం జరిగింది..నిజంగానే పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే పెళ్లిళ్లు వర్కౌట్ అవ్వక విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఎందుకు చేసుకుంటారు అని అడిగింది అని తెలిపారు అంతేకాకుండా వీడియోతో పాటు జరగాలి పెళ్లి అని క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది.

అయితే ఇది చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నవదీప్ కూడా త్వరలోనే వివాహం చేసుకొని పనిలో ఉన్నారంటూ అందుకే ఇలా పోస్ట్లు పెడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరేమో అన్నా మీ పెళ్లికి మమ్మల్ని కచ్చితంగా పిలవండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఈ విషయాన్ని బట్టి చూస్తే నవదీప్ కూడా త్వరలోనే ఒక ఇంటి వారు కాబోతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.