“అనసూయ ట్రెండ్ ఫాలో అవ్వదు..సెట్ చేస్తుంది”..అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ కావాలా..!?

అనసూయ .. ఒకప్పుడు న్యూస్ రిపోర్టర్ గా.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీగా ..ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది . ఈ మధ్యకాలంలో అనసూయను ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో జనం మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా ఆమెపై వల్గర్ చీప్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు జనాలు.

అయితే వాటిని పెద్దగా పట్టించుకోని అనసూయ తన పని తాను చేసుకుంటూ పోతుంది. రీసెంట్గా షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కు హాజరైన అనసూయ అదిరిపోయే లుక్స్ లో అభిమానులను కట్టిపడేసింది . ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే మోడ్రన్ టచ్ చేస్తూ బ్లౌజ్ ని మరింత మోడ్రన్ గా క్రియేట్ చేయించుకునింది అనసూయ . దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

రాయచోటిలో రీసెంట్గా అనసూయ ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కు హాజరైంది. అనసూయ రాకతో రాయచోటి మొత్తం సందడి సందడి వాతావరణం నెలకొంది . ఈ క్రమంలోనే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అభిమానులను బాగా ఆకట్టుకునింది. పట్టుచీర కట్టుకొని మోడ్రన్ బ్లౌజులో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ బ్లౌజ్ ని జాకెట్ అనడం కంటే బ్రా అంటే బాగుంటుంది అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే .. మరికొందరు మాత్రం అనసూయ ట్రెండ్ ని ఫాలో అవ్వదని ట్రెండ్ సెట్ చేస్తుందని .. ఇక యంగ్ బ్యూటీస్ అందరూ కూడా ఇదే బ్లౌజ్ మోడల్ ను ఫాలో అయిపోతారు అని అనసూయ ట్రెండ్ సెట్టర్ అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో అనసూయ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!