ఎన్టీఆర్ కు ప్రశాంత్ నీల్ తో సినిమా వెరీ వెరీ స్పెషల్.. లైఫ్ లో మర్చిపోలేనిది.. ఎందుకంటే..?

ప్రెసెంట్ ..ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . రెండవ హీరోయిన్గా రష్మిక లేదా మృణాల్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది . అయితే ఎన్టీఆర్ తర్వాత చేయబోయే సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కమిట్ అయ్యాడు .

ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫ్యాన్స్ తెగ హంగామా చేసేస్తూ ఉంటారు . అయితే ఎన్టీఆర్ ఇంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించిన అవార్డులు అందుకున్న కోట్లు కలెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ తో సినిమా ఎన్టీఆర్ కి చాలా చాలా స్పెషల్ ఎందుకంటే .. ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ ఈ సినిమా ద్వారానే తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతున్నాడట .

మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అభయ్ రామ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తన కొడుకు తన సినిమా ద్వారానే ఇంట్రడ్యూస్ అవుతూ ఉండడం.. అది కూడా తన ఫ్రెండ్ డైరెక్షన్లో కావడం ఎన్టీఆర్ కు చాలా చాలా హ్యాపీగా ఉందట . అందుకే ఆయన ఈ సినిమా అంటూ తన లైఫ్ లో ఎంతో స్పెషల్ అని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొస్తున్నారు..!!