ఆ స్టార్ డైరెక్టర్ నెంబర్ బ్లాక్ చేసి పడేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…. ఎందుకో తెలుసా…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ముందుగా వినిపించేది పవన్ కళ్యాణ్ పేరే. అయితే పవన్ కళ్యాణ్ ఓ స్టార్ డైరెక్టర్ నెంబర్‌ని బ్లాక్ చేశాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఎస్. జె. సూర్య. పవన్ కళ్యాణ్ కి ” ఖుషి ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ ని పవన్ ఎందుకు బ్లాక్ చేశాడు.. అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక సూర్య కేవలం సినిమాలను డైరెక్ట్ చేయడమే కాకుండా పలు సినిమాలలో కూడా నటిస్తాడు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒక మంచి కథతో పవన్ కళ్యాణ్ తో మళ్లీ సూపర్ డూపర్ హిట్ కొట్టాలని సూర్య ఆశపడ్డాడట. ఇక సూర్య కథ చెప్పే సమయంలో పవన్ కళ్యాణ్ వేరే సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నాడట. దాంతో ” నీ కథను తర్వాత చేద్దాం. ప్రజెంట్ నువ్వు నేను నటిస్తున్న కాటమరాయుడు సినిమాలో నటించు ష‌ అని పవన్ సూర్యకి చెప్పాడట.

ఇక ఈ డైరెక్టర్ కూడా ఓకే చెప్పాడట. ఇక అదే సమయంలో మహేష్ బాబు నటించిన ” స్పైడర్ మాన్ ” సినిమాలో మంచి రోల్ రావడంతో పవన్ కి హ్యాండ్ ఇచ్చాడట సూర్య. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన పవన్ కళ్యాణ్ వెంటనే సూర్య నెంబర్ని బ్లాక్ చేసి పడేసాడట. ఇక పవన్ ఒకరోజు సూర్యతో మాట్లాడుతూ..” నువ్వు రీజన్ చెప్పి సినిమా నుంచి తప్పుకుంటే నేనేం అనే వాడిని కాదు. కానీ నువ్వు నమ్మించి మోసం చేశావు ” అంటూ సీరియస్ అయ్యాడట పవన్. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.