ఒక్క మాధవీలతకే కాదు… భూమికకి కూడా ఆయన నరకం చూపించాడు గా….!!

మాధవిలత ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కర్నాటక బల్లారికి చెందిన ఈ ముద్దుగుమ్మ చిన్నవయసులోనే హీరోయిన్గా మంచి గుర్తింపు అందుకుంది. అయినా ఆ క్రేజ్‌తో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ మొదటిగా నటించిన మూవీ ” నచ్చావులే “. ఈ సినిమాకి రవిబాబు దర్శకత్వం వహించాడు. ఇక డైరెక్టర్ తోనే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు మాధవిలత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఈ ఘటనే ఈ ముద్దుగుమ్మ కి ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేసింది. ఇక అనంతరం నానితో ” స్నేహితుడా ” సినిమా చేసినప్పటికీ… అది డిజాస్టర్ గా నిలిచింది.

ఇక అప్పటికే కోపంతో ఊగిపోతున్న రవిబాబు.. ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకుండా చేశాడు. అయితే రవి బాబు కి బలయింది మాధవిలత ఒకటే కాదు భూమిక కూడా ఇబ్బందులు పడినట్లు సమాచారం. భూమికకి ఖుషి సినిమా అనంతరం టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలలో సైతం నటించింది. ఒక దశలో స్టార్ హీరోయిన్గా సౌత్‌లో భారీ రెమ్యూనరేషన్ సైతం పుచ్చుకుంది.

ఇక ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ” మిస్సమ్మ‌ ” లాంటి సినిమా ఈ ముద్దుగుమ్మ కి మంచి పేరు తెచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో దర్శకుడు రవిబాబు భూమిక‌ను బాగానే ఇబ్బంది పెట్టాడట. కానీ.. ఎప్పుడు దీని గురించి భూమిక బయట పెట్టలేదు. ఇక హీరోయిన్గా అవకాశాలు తగ్గే సమయంలో ” ఎంసీఏ ” సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన కూడా రవిబాబు పెట్టిన టార్చర్ ను మర్చిపోలేక పోయిందట. అయినప్పటికీ తాను ఎంత ఇబ్బంది పడిన.. రవిబాబు గురించి బయట పెట్టలేదు. అది భూమిక గొప్పతనం.