మహేష్ బాబు తో సినిమాపై క్లారిటీ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా..!!

డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా మొదట అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డివంగ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.. అయితే ఎందుకో కానీ ఇద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలై మంచి పాపులారిటీ అందుకుంది.


అయితే మొదట మహేష్ బాబుకు ఈ సినిమా కథని చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కథకి ఎలా నో చెప్పేవన్నా అంటూ మహేష్ అభిమానులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా సందీప్ వంగ మహేష్ బాబు గురించి కొన్ని విషయాలు తెలిపారు. మహేష్ బాబు గారికి ఒక కథ చెప్పాను ఆయనకు కూడా నచ్చింది అయితే వేరే కమిట్మెంట్ వలన అది ముందుకు వెళ్లలేదు.. కానీ భవిష్యత్తులో మహేష్ బాబు ,రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయాలని ఉంది అంటూ తెలియజేశారు సందీప్ రెడ్డి వంగ.

ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. వచ్చేయేడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమాని చేయబోతున్నట్లు సమాచారం..మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నారేమో చూడాలి మరి. 2027 లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.