డబల్ ఎలిమినేషన్ లో… ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అవుట్… ఇది కదా మజా అంటే…!!

బిగ్ బాస్ 7 ఎంత రసవక్తంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. ఈవారం చివరి దశకు చేరుకోవడంతో నాగార్జున ఎపిసోడ్ గురించి బిగ్ బాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే శుక్రవారం జరిగిన కొన్ని కారణాల చేత ప్రోమో చాలా లేట్ గా విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో మొదట పల్లవి ప్రశాంత్ పై హోస్ట్ నాగార్జున సీరియస్ అయ్యాడు.

ఇక ప్రశాంత్ గోస్ట్ గా ఉన్న సమయంలో అశ్విని పై ప్రశాంత్ ఏదో వల్గర్ కామెంట్స్ చేశాడు. వాటిని కూడా నాగార్జున ఖండించాడు. ఇక ఇదిలా ఉంటే ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని.. మొన్న వారమే నాగార్జున తెలియజేశాడు. దీంతో బిగ్ బాస్ అభిమానులకి కంగారు చుట్టుకుంది. ఇక శనివారం ఎపిసోడ్లో ఓటింగ్ లు తక్కువగా ఉండడంతో అశ్విని ఎలిమినేట్ అయింది.

అలాగే ఆదివారం (ఈరోజు) రతిక ఎలిమినేట్ అవ్వనున్నట్లు సమాచారం. బిగ్బాస్ హౌస్ నుంచి నాలుగో వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన రతిక… మళ్లీ రీఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ గా ఆడతది అనుకున్న వారికి గట్టి షాక్ ఏ ఇచ్చింది. ప్రతివారం నెక్స్ట్ వీక్ నేనేంటో చూపిస్తా అంటూ మాటలు చెప్పిన రతిక… తనేంటో చూపించకుండానే మళ్లీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఏదేమైనప్పటికీ ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటే ఇదేనేమో…!!