బన్నీ – త్రిష కి లింక్ పెట్టిన స్టార్ డైరెక్టర్.. అక్క, తమ్ముడు లాగా ఉన్నారంటూ కామెంట్లు…!!

లియో సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న త్రిష ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇటీవలే ఈ బ్యూటీపై నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం లేపాయో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా త్రిషకు మద్దతుగా పలు సెలబ్రిటీలు నిలిచి మన్సూర్ ని ఖండించారు కూడా. చివరికి మన్సూర్ పై ఓ కేసు కూడా నమోదు చేపించారు.

ఇక ఇదంతా పక్కన పెడితే..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కన్ను త్రిషపై పడిందంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ” గుంటూరు కారం ” సినిమా తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో బన్నీ కి జోడిగా పలు హీరోయిన్స్ నీ అప్రోచ్ అవుతున్నాడట త్రివిక్రమ్. ఈ క్రమంలోనే చివరికి త్రిషను ఓకే చేసినట్లు సమాచారం. ఇక ఈ వార్త తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్…” ఏమయ్యా నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా.. బన్నీ, త్రిష.. అక్క, తమ్ముడు లాగా ఉంటారు. వాళ్ళిద్దరూ హీరో, హీరోయిన్ ఏంట్రా బాబు…” అంటూ ఫైర్ అవుతున్నారు.