రజనీకాంత్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. కారణం ఇదే..

సౌత్ ఇండియన్ స్టార్ హీరో తలైవర్ రజినీకాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల జైలర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పుడల్లా రజినీకాంత్ హిమాలయాలు చుట్టూ తిరుగుతూ, దైవదర్శనాలు చేసుకుంటూ కూల్‌గా గ‌డుపుతూ ఉంటాడు అన్న సంగతి చాలా మందికి తెలుసు. అలాంటి రజినీకాంత్‌కి సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌ ఓ విషయంపై స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ రజినీకాంత్ కి ఎన్టీఆర్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు..? ఏం జరిగిందో..? ఇప్పుడు చూద్దాం.

రజనీకాంత్ మంచి వయసులో ఉన్నప్పుడు మందు, సిగరెట్ల కు బాగా అలవాటు పడ్డాడట. మందు ఎక్కువగా తాగి సినిమా షూటింగ్స్‌కి కూడా ఆలస్యంగా వస్తూ టీమ్ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడట. ఇక ప్రొడ్యూసర్ కూడా రజనీకి అవకాశాలు ఇవ్వాలంటే కాస్త భయపడుతూ ఉండేవారట. అలా రజనీకాంత్ – ఎన్టీఆర్ కలిసి నటించిన టైగర్ సినిమా షూటింగ్ టైంలో కూడా మందు తాగి సరైన సమయానికి రాకపోవడంతో డైరెక్టర్ వేరే హీరోని పెడదామని నిర్ణయించుకున్నారట. దానికి ఎన్టీఆర్ అలా చేయకండి అతని కెరీర్ పాడైపోతుంది అని డైరెక్టర్ కు నచ్చ చెప్పాడట.

ఇక రజనీకాంత్ తో కూడా ఎన్టీఆర్ మాట్లాడుతూ మరోసారి ఇలాంటి వ్యసనాలతో షూటింగ్కు ఆలస్యం చేస్తే మూవీ టీం ఇబ్బంది పడినట్లుగా తెలిస్తే అసలు బాగోదు.. నువ్వు అల‌స్యం చేయ‌డం వల్ల నీతో పాటు అందరూ ఇబ్బంది పడుతున్నారు.. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఇకనైనా షూటింగ్ టైంలో ఇలాంటివి చేయకు అంటూ స్టిక్ వార్నింగ్ ఇచ్చాడట ఎన్టీఆర్. ఇక అప్పటినుంచి రజనీకాంత్ కూడా షూటింగ్ టైంలో అలాంటివేవీ చేయలేదట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఎప్పుడూ చిల్‌గా, కూల్ గా కనిపించే రజినీకాంత్ అప్పట్లో మందు, సిగరెట్లు కూడా తాగేవారా అంటూ అందరూ షాక్ అవుతున్నారు.