దాన్ని చూసే హీరోయిన్గా తీసుకుంటున్నారు.. టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ లో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. ఇంటర్నెట్, టెక్నాలజీ రోజు రోజుకు మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆధునిక యుగంలో సెల్ఫోన్‌తో ప్రపంచమంతా మన అర చేతిలో ఉంటుంది. అలాంటప్పుడు మనిషి సెల్ఫోన్ చుట్టూ తిరగడంలో ఆశ్చర్యం ఏం లేదు. అయితే సోషల్ మీడియాను ఎంతోమంది స్వప్రయోజనాలకు వాడుతున్నారు. కానీ ఎక్కడో కొందరు మాత్రం నేరాలు, ఘోరాలను చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. మరోపక్క అవకాశాలను, అభివృద్ధికి, ఆదాయానికి, టైంపాస్ కి కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది.

 

సినీ సెలబ్రిటీస్ విషయంలో కూడా ఇది అతీతంకాదు. తాజాగా సామాజిక మాధ్యమాల గురించి టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ అను కీర్తివాస్ చేసిన‌ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. అచ్చంగా తిరుచ్చి వాసి అయిన అనుకీర్తివాస్ మిస్ ఇండియా కిరీటం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఆమెకు హీరోయిన్ అవకాశాలను తెచ్చిపెట్టింది. విజయ్ సేతుపతి జంటగా డిఎస్పి అనే సినిమాలో కథానాయకగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అను కీర్తి.. తాజాగా తెలుగులో రవితేజ సరసన టైగర్ నాగేశ్వరావు సినిమాలో నటించింది.

ప్రస్తుతం కోలీవుడ్ వెట్రీ మూవీలో హీరోయిన్గా నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇప్పటివరకు ఈ బ్యూటీ చాలా తక్కువ సినిమాల్లో నటించిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో అనుకీర్తివాస్‌ మాట్లాడుతూ గత ఐదేళ్ల క్రితం నాకు సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రాముఖ్యత నాకు బాగా అర్థమైంది అంటూ చెప్పుకొచ్చింది.

మొదట్లో హీరోయిన్ అవకాశాలు వచ్చినప్పుడల్లా మీ ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఐడిని మాకు పంపించండి అంటూ చెప్పుకొచ్చేవారు.. అయితే దాన్నిబట్టే సినిమా అవకాశాలు వస్తున్నాయని.. నిర్ణయాలు తీసుకుంటున్నారని.. నాకు మెల్లమెల్లగా అర్థమైంది. దీంతో నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటున్నాను అంటూ అను కీర్తివాస్ చెప్పుకొచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by Anukreethy Vas (@anukreethy_vas)