చిరు పక్కన హీరోయిన్ గా నటించి ఆయనకే చెల్లి, తల్లిగా నటించిన హీరోయిన్స్ వీళ్ళే..

టాలీవుడ్ లో హీరోలా లైఫ్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలుసు. ఆరు ప‌దులు వయసు వచ్చిన సరే ఇంకా హీరోలుగా కొనసాగుతూనే ఉంటారు. ఏజ్ పెరుగుతున్న కొద్ది హీరోలుగా కాకుండా విలన్లుగా కూడా నటిస్తున్నారు. కానీ ఫాదర్ క్యారెక్టర్లు మాత్రం చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లకు అలాంటి ఛాన్స్ ఉండదు. నాలుగు ప‌దులు వయసు వ‌చ్చేస‌రికి చాలామంది హీరోయిన్స్ మెల్లమెల్లగా ఫెడ్అవుట్ అయిపోతూ ఉంటారు. ఇక కొంత కాలానికి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సరే అక్క, వదిన లేదా తల్లి పాత్రలో కూడా నటించాల్సి ఉంటుంది.

ఇలా చాలామంది హీరోయిన్లు ఇప్పటికే హీరోయిన్లుగా నటించిన‌ ఆ హీరోలకే తల్లులుగా కూడా నటించారు. అలా మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్గా నటించిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు మళ్లీ ఆయనకే తల్లిగా, చెల్లిగా నటించారు. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు.. ఏ సినిమాల్లో నటించారో.. చూద్దాం. 1979లో జయసుధ – చిరంజీవి కాంబోలో ఇది కథ కాదు జీవితం అనే మూవీ వచ్చింది. బాలచందర్ ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌. తర్వాత మగధీరుడు అనే సినిమాలో మళ్లీ చిరంజీవి – జయసుధ జంటగా నటించారు. ఇక 1995లో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన రిక్షావోడు సినిమాలో జయసుధ చిరంజీవి తల్లిగా కూడా నటించింది.

అయితే ఈ సినిమా వచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. చిరంజీవికి హీరోయిన్గా నటించిన ఈమె మళ్లీ తల్లిగా కూడా నటించింది.. కానీ చిరు మాత్రం అదే యంగ్లుక్‌తో హీరోగా కొనసాగుతున్నాడు అంటూ టాక్‌ నడిచింది. అదేవిధంగా 1980లో ప్రేమ తరంగాలు మూవీలో చిరంజీవి – సుజాత జంటగా నటించారు. ఆ తర్వాత సీతాదేవి సినిమాలో సుజాత చిరంజీవి చెల్లెలుగా కూడా నటించింది. ఇక 1995లో మెగాస్టార్ హీరోగా వచ్చిన బిగ్ బాస్ సినిమాలో మెగాస్టార్ సరసన రోజా హీరోయిన్గా నటించగా.. ఆమె తల్లి పాత్రలో సుజాత నటించింది. ఇలా సుజాత చిరంజీవితో కలిసి చెల్లిగాను హీరోయిన్ గానే కాక తల్లి పాత్రలో కూడా నటించింది.