నాచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా నటించిన మూవీ ‘ హాయ్ నాన్న’. మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా కీలక పాత్రలో నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యవ్ రూపొందిస్తున్నాడు. డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల, చెరుకూరి వెంకట మోహన్, మూర్తి కేఎస్ సంయుక్తంగా వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధంతో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నాని రాజకీయ నాయకుడిగా మూవీని ప్రమోట్ చేస్తూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాకు మంచి హైప్ కూడా నెలకొంది. ‘ హాయ్ నాన్న ‘ డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డీల్స్ విషయాల్లో నాని కూడా ఇన్వాల్వ్ అయ్యారని సమాచారం. దీని వెనుక ఆయన రెమ్యూనరేషన్ ప్రధాన కారణమట. ఈ సినిమాకి రూ.25 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారం ఈ సినిమాతో పాటు మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
థియేటర్లలో భారీ పోటీ ఉండడంతో ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. దీంతో నానినే రంగంలోకి దిగి డిఫరెంట్ స్టైల్స్ లో ప్రమోషన్స్ జరుపుతున్నాడు. ఇప్పటికే పొలిటికల్ నేపథ్యంలో నాని చేసిన ప్రచారం మంచి హైప్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే నవంబర్ 24న సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు మూవీ టీం ప్రకటించారు. రెండున్నర గంటల సినిమాని రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో చూపించబోతున్నాం అంటూ నాని ట్విట్ చేశాడు. దీంతో ఈ సినిమా రన్ టైమ్ 2 1/2 గంటలని తేలిపోయింది. అదేవిధంగా నాని చేసిన ట్వీట్ తో.. రిలీజ్ కాబోయే ఈ ట్రైలర్ పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.