త్రిషకు మద్దతుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి… వైరల్ గా మారిన పోస్ట్…!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష మనందరికీ సుపరిచితమే. తాజాగా ” లియో ” సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకుంది ఈ బ్యూటీ. ఇక త్రిషపై తమిళ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని లేపుతున్నాయో మనందరికీ తెలిసిందే.

ఈ నటుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి.. తీవ్రంగా మండిపడ్డారు. ఒక స్టార్ హీరోయిన్ గురించి ఇలా మాట్లాడటం సరైనది కాదంటూ మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు కూడా. ఇక ఈ ఘటనపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ…” త్రిషపై నటుడు మన్సూర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.

ఇలాంటివి ఒక ఆర్టిస్ట్ నే కాదు. ఏ అమ్మాయిని కూడా అనకూడదు. ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం వారి వంకర బుద్ధి. త్రిషకు మాత్రమే కాదు. ఇలాంటి కామెంట్స్ ఏ అమ్మాయిపై చేసిన.. నేను వారికి అండగా నిలబడతాను ” అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చిరు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.