బిగ్ బాస్ హౌస్ లో సెన్సేష‌న్‌గా మారిన కంటెస్టెంట్ ప్రెగ్నెన్సీ… అతని మీదే అనుమానం.. తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటున్న ప్రేక్షకులు…!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ షో పేరే వినబడుతుంది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్ లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ.. వారిలోనే ఎలిమినేషన్లు చేసి బయటకు పంపించడం లాంటివి చేస్తూ.. రోజురోజుకి టిఆర్పి రేటింగ్ పెంచుకుంటుంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఈ షో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రారంభమైంది.

ఈ షో స్టార్టింగ్ లో సెలబ్రిటీలతో నడిపినప్పటికి.. అనంతరం సామాన్యులను, పెళ్లయిన జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా తాజాగా జరుగుతున్న సీజన్లో ఓ కంటెస్టెంట్ గర్భవతి అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది తెలుగు బిగ్ బాస్ లో కాదు.. హిందీ బిగ్ బాస్ లో అని తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ లో భార్యాభర్తలైన అంకిత లోఖండే, విక్కీ జైన్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్నారు.

ఇక కొద్ది రోజులుగా అంకిత అనారోగ్యంతో బాధపడుతుందని చెబితే.. బిగ్ బాస్ యాజమాన్యం మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని భర్త విక్కీ చెప్పాడు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పరిస్థితి ఏంటని ఇద్దరూ భయపడ్డారు. ఇదే నిజమైతే కచ్చితంగా బిగ్ బాస్ నుంచి బయటకు పంపించేస్తారని ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.