నేడు అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ పుట్టినరోజు… అలాంటి ఫోటోలను షేర్ చేసిన బన్నీ…!!

అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మనందరికీ సుపరిచితమే. ఈ చిన్నారి ” శాకుంతలం ” సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. చిన్నప్పటి భరతుడిగా కనిపించి తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. సమంతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన.. అర్హ నటనకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఇక అర్హ మరోసారి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ” దేవర ” సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో పోషించనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో అర్హ జాన్వి.. చిన్ననాటి పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అర్హ రోల్ 10 నిమిషాలు మాత్రమే ఉంటుందట. కానీ పారిదోషకం మాత్రం రూ. 20 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే అల్లు స్నేహ తరచు అర్హ, అయాన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

వీరి గురించి ఏ పోస్ట్ పెట్టినా.. క్షణంలో లక్షలు లో లైకులు సైతం వస్తాయి. తన క్యూట్ నెస్ తో, చలాకీ తనంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక నేటితో అర్హ 7 ఏళ్లలో అడుగు పెట్టబోతోంది. అర్హ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలే చెబుతున్నారు. ఇక ఇదిలా ఉండగా.. అర్హకు విషెస్ చెబుతూ క్యూట్ ఫోటోను షేర్ చేశాడు బన్నీ. ఈ ఫోటోను చూసిన ప్రేక్షకులు.. క్యూట్ అంట‌టూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.