బిగ్ బాస్ 7 ఎంత రసోవత్తరంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టారు హౌస్ మేట్స్. అయితే 11వ వారం అంటే ఆదివారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ అనుకోని రీతిలో నిన్న నో ఎలిమినేషన్ అయ్యింది. అంటే ప్రిన్స్ యావర్ తన ఎఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసిన కారణంగా… గత 11వ వారం ఎలిమినేషన్ ఆపేసినట్లు నాగార్జున ప్రకటించాడు. దీనిపై నెట్టింట విమర్శలు సైతం వచ్చాయి.
కావాలని ఎలిమినేషన్ ప్రాసెస్ ఆపేసారని.. శోభాని సేవ్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారంటూ కామెంట్లు సైతం చేశారు. ఇక ఈవారం ఖచ్చితంగా శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఈ వారం అయితే ఏకంగా ఎలిమినేషన్ ఏ లేకుండా చేశాడు బిగ్ బాస్. ఇక దీనిపై ప్రేక్షకులు మాత్రమే స్పందించడం కాకుండా బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చిన ఆట సందీప్ సైతం ఓ పోస్ట్ పెట్టాడు.
” ఏమయ్యా బిగ్ బాస్.. జనాల ఓట్లు లెక్క లేనప్పుడు ఎందుకయ్యా ఓటింగ్ ప్రాసెస్ పెట్టావు.. నీకు నచ్చిన కంటెస్టెంట్లను సేవ్ చేసుకోవచ్చు కదా. దీనికి జనాల ఓటింగ్ ఎందుకు.. డిజర్వ్ కంటెస్టెంట్ అయిన నేను ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఎలిమినేషన్ ప్రాసెస్ తీసేయలేదు. యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసాడని ఎలిమినేషన్ తీసేసాం అని చెప్పారు. ఇదేం తుప్పాస్ రీజన్ “అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం సందీప్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.