” ఆదికేశవ ” సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగవంశీ…!!

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మనందరికీ సుపరిచితమే. ఈయన టాలీవుడ్ లోనే ఓ సెన్సేషన్ డబ్ల్యూ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ ” ఆదికేశవ “. ఇక ఈ సినిమా ఓ మాస్ యాక్షన్ డ్రామాగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సైతం విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న నాగవంశీ లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈయన మాట్లాడుతూ…” ఈ మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి లాంటి మాస్ సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇక ఆ సినిమాలు తర్వాత మళ్లీ ఆ రేంజ్ ఉన్న‌ సినిమా ఇంకా రాలేదు. ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి ” ఆదికేశవ ” మూవీ రానుంది ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బాలయ్య ” భగవంత్ కేసరి ” సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. ” అందులో బాలయ్య వేరే పాయింట్ టచ్ చేశారు.. కానీ ప్రాపర్ గా ఓ మాస్ యాక్షన్ సినిమాగా అయితే ఆదికేశవ నిలుస్తుంది ” అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాగ వంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.