” పుష్ప 2 ” చిత్ర బృందానికి భారీ షాక్… ఆ సీన్ ని లీక్ చేసిన DSP…!!

పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గా ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు సైతం పొందాడు. ఈ సినిమా ప్రకటన సమయంలో సుకుమార్ కు పాన్ ఇండియా ఆలోచన లేదు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

కేవలం బాలీవుడ్ లోనే ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొత్తంగా పుష్ప రూ. 360 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా కి సీక్వెల్ గా ” పుష్ప 2 ” తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పార్ట్ – 2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక పుష్ప ది రూల్ బడ్జెట్ రూ. 350 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ గురించి కీలక విషయాలు లీక్ చేశాడు.

 

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ” సినిమా స్క్రీన్ ప్లే ఉత్కంఠ రేపుతుంది. ఇక జాతర నేపథ్యంలో గంగమ్మ అమ్మవారి గెటప్లో బన్నీతో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి ” అంటూ తెలిపారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ గంగమ్మ గెటప్ ఫుల్ వైరల్ అయింది. ఈ గెటప్ కి గాను ఫుల్ రెస్పాన్స్ సైతం దక్కింది. ఇక తాజాగా దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ బన్నీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది.