కన్న కూతురిని కూడా పట్టించుకోకుండా.. ఆ విధంగా డబ్బులు ఇస్తున్న నాగబాబు…. అయ్యో పాపం నిహారిక…!!

నిహారిక ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలో టీవీ యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి, యూట్యూబ్లో సిరీస్ లతో… అనంతరం హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా దూసుకుపోయింది. ఇక ఈ అమ్మడు కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నప్పుడే జొన్నలగడ్డ చైతన్యన్ని వివాహమాడింది.

కానీ అనుకోని పరిణామాల వల్ల వీరిద్దరి జీవితం మధ్యలోనే ఆగిపోయింది. అలాగే తండ్రి, కూతురు మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అలాగే నాగబాబు, నిహారికకు మధ్య అనుబంధం ఏ విధంగా ఉంటుందో మనకి తెలుసు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు ఆసక్తిక‌ర‌ కామెంట్లు చేశాడు.

నాగబాబు మాట్లాడుతూ…” నిహారిక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన తరువాత ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు నాకు కొంత డబ్బు అవసరం అవుతుందని నన్ను అడిగేది. అడగ్గానే ఇస్తాను కానీ వడ్డీకే. దీంతో నిహారిక డాడీ నేను మీకు ఇంత ఇవ్వాలి కదా అంటూ పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. దీంతో కొన్నిసార్లు నేను ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవడం కూడా మానేస్తాను ” అంటూ నాగబాబు పేర్కొన్నాడు.