ప్రధాని మోడీ సభలో ” బాహుబలి 2 ” డైలాగులు రిపీట్… వీడియోను ఎంజాయ్ చేస్తున్న అభిమానులు…!!

హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో.. బీసీల అంత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…” ఎల్బీ స్టూడియోతో తనకు అనుబంధం ఉందని.. పదేళ్ల క్రితం ఈ స్టూడియోలో ప్రజలు ఆశీర్వదించడంతో తను ప్రధాని అయ్యారని ” వ్యాఖ్యానించారు.

” ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ప్రభుత్వం రాబోతుందన్నారు. నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో బీజేపీ కి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోడీ ” అభినందించారు. ” మేరే సాత్ పవన్ హే” అని మోడీ చెప్పారు. దీంతో ఎల్బి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది.

ప్రధాని మోడీ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే బీజేపీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అరుపులు, కేకలు షురూ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ మరోసారి రిపీట్ చేశారంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు. జస్ట్ బాహుబలి 2 ఇంటర్వెల్ సీక్వెన్స్ రిపీటెడ్.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.స‌