బాలయ్య ” భగవంత్ కేసరి ” మూవీలో… ఆ సీన్స్ ఎందుకు కట్ చేశారు? అసలు కారణం ఏంటి?

బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ” భగవంత్ కేసరి ” గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా.. శ్రీ లీల కూతురు పాత్రలో నటించగా.. అర్జున్ రాంపాల్ విలన్ గా పోషించాడు.

బాలయ్య, కాజల్ మధ్య లవ్ ట్రాక్ ని ఈ సినిమాలో నడిపించారు. అయితే ఇది కొంచెం ఎక్కువ సేపు ఉండడం వల్ల దీనిని కట్ చేశారు. అది కూడా బాలయ్య చెప్పిన సలహాల మేరకు ఆ ట్రాక్ ని తీసేసారట. అలాగే ఆ సీన్స్ సినిమాలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని వాటిని తొలగించారట.

ఓ తండ్రి, కూతురు మధ్య వెళుతున్న స్టోరీ మళ్లీ దీనివల్ల బోర్ కొట్టే ప్రమాదం ఉందని… బాలయ్య చెప్పారట. ఈ సలహా విన్న అనిల్ రావు పూడి ఇదే కరెక్ట్ అని.. ఆ ట్రాక్ ని తొలగించారట. బాలయ్య ఆలోచన అద్భుతం అంటూ కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది