దేవర చిత్రం నుంచి ఊహించని అప్డేట్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రాలలో దేవర కూడా ఒకటి.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్మెంట్ చేశారు ఎన్టీఆర్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తూ ఉన్నారు.

Devara new poster : r/tollywood

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పలు ప్రాంతాలలో శరవేగంగా జరుపుకుంటోంది .ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నారు పక్కా ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళుతూ ఉండగా ఈ సినిమా నుంచి ఒక్కొక్క క్లిప్ కట్ చేయకుండా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర బృందం. ఇటీవలే గోవా షెడ్యూలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా దేవర సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ని చిత్ర బృందం పంచుకోవడం జరిగింది.

దేవర సినిమా ఇంకా 150 రోజులు విడుదలకు మాత్రమే ఉంది అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. భయానికి మరోపేరే దేవర 150 రోజుల్లో పెద్ద స్క్రీన్ లో భారీగా ప్రదర్శన చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ..devara frenzy కౌంటన్ షూర్ అంటూ ఒక అదిరిపోయే పోస్టర్ మిస్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో రెండు చేతులతో ఆయుధాలు పట్టుకొని నీళ్ల మధ్యలో ఒక రాయి మీద ఎన్టీఆర్ బీకరంగా నిలబడుతూ ఉండడం చూపించారు. ఈ అప్డేట్ తో అభిమానుల సైతం కాస్త ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Devara Movie (@devaramovie)