బాలయ్య అన్ స్టాపబుల్.. కు పోటీగా స్టార్ హీరోస్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన రానా, విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా పలు రకాల టివి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇద్దరు బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపాబుల్ షో కి వస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి చాలా వేగంగా జరుగుతోంది. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఆయా పార్టీలు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ నే ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రోగ్రాం ని రానా , విజయ్ దేవరకొండ హోస్టుగా చేయబోతున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరూ కలిసి కేటీఆర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నారా లేకపోతే ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది అనే విషయం తెలియడం లేదు.

ఈ ఇంటర్వ్యూ మరో కొద్ది రోజులలో పలు రకాల టీవీ చానల్స్ లో కూడా ప్రచారం చేయబోతున్నారు. అయితే అన్ స్టాపబుల్ షోలో బాలయ్య రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా పొలిటికల్ నేపథ్యంలో హైలెట్ అయ్యేలా చేస్తూ ఉండడంతో ఆ ఇంటర్వ్యూలకు కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి.మరి రానా, విజయ్ కలిసి ఈ పొలిటికల్ ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలియడంతో ఏ రేంజ్ లో వ్యూస్ వస్తాయని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.