” ఇంట్లో నా భార్య నన్ను బేబచ్చంగా కొడుతుంది “… ఆలియా అసలు రూపం బయటపెట్టిన రణబీర్….!!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్, ఆలియా మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుని.. పెద్దల అంగీకారంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ పాప కూడా జన్మించింది. ఈ పాపను చూసుకోవడానికి ఈ జంట కొద్ది రోజులు సినిమాలకు దూరమయ్యారు. ఇక ప్రస్తుతం వీరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

ఇక రణబీర్, రష్మిక కాంబోలో ” యానిమల్ ” సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చిత్ర యూనిట్ చాలా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే రణబీర్ తన భార్య ఆలియా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రణబీర్ మాట్లాడుతూ…” నేను ఈ సినిమాలో ఉండే పాత్రతో డిటాచ్ ఉంటాను. ఇది మనం ప్రేమించే వారిపై మంచి అభిప్రాయాన్ని పెంచుతుంది. కానీ ఇంటికి వెళ్లాక నేను ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం నా భార్య నన్ను కొడుతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రణబీర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.