“ఆ ఉసురు ఊరికేపోదు గుర్తుపెట్టుకో”..తెలుగు హీరోని నమ్మిచి మోసం చేసిన ప్రశాంత్ నీల్ కు ఫ్యాన్స్ వార్నింగ్..?!

ప్రశాంత్ నీల్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు.  పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ హీరోలకి మించిన రేంజ్ తో దూసుకుపోతున్నాడు . మరీ ముఖ్యంగా కే జి ఎఫ్ సిరీస్ తో గ్లోబల్  స్థాయిలో గుర్తింపు సంపాదించేసుకున్నాడు ప్రశాంత్ నీల్.. అయితే ప్రశాంత్ నీల్  తాజాగా తెరకెక్కిస్తున్న  సలార్ సినిమాను మన తెలుగు హీరోతో చేయాలి అని ఆశపడ్డారట.

ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్ . బన్నీ తో ఈ కథను తెరకెక్కించాలని చాలా ఆశపడ్డాడట ప్రశాంత్ నీల్.  అల్లు అర్జున్ కి  కూడా కథ నచ్చిందట.  కానీ టైం అడ్జస్ట్ చేయలేక కొన్ని నెలలు వెయిట్ చేయమంటూ సజెస్ట్ చేశారట.. అంతవరకు ఆగలేని ప్రశాంత్ నీల్  ఆ కథను తీసుకెళ్లి ప్రభాస్ కి చెప్పగా ప్రభాస్ ఆ కథను యాక్సెప్ట్ చేసి సెట్స్  పైకి తీసుకొచ్చేసాడు . మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది .

అయితే బన్నీ ఎంతో ఇష్టపడిన సినిమాను ఇలా వేరే హీరోకి ఇచ్చేయడం పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ఈ సినిమా విషయంలో అలా బన్నీని మోసం చేశావు ఆ పాపం ఊరికే పోదు అంటూ ఘాటుగా పరోక్షంగా శాపనార్ధాలు పెడుతున్నారు . అయితే ఇప్పటివరకు ఆ కథను బన్నీ కోసం ప్రశాంత్ నీల్  రాసుకున్నాడు అన్న విషయం ప్రభాస్ కి తెలియనే తెలియదట.  దీంతో ప్రభాస్ సైతం ఈ న్యూస్ విని షాక్ అయిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!